logo

దుకాణదారులకు.. వీఎంఆర్‌డీఏ తాఖీదులు

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) బకాయిలపై దృష్టిసారించింది. పలు ప్రాంతాల్లోని వాణిజ్య భవనాల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు  తాఖీదులు జారీ చేసింది. వారు చెల్లించాల్సిన బకాయిల వివరాలు

Published : 28 Jan 2022 04:51 IST

బకాయిలు చెల్లించాలని ఆదేశం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) బకాయిలపై దృష్టిసారించింది. పలు ప్రాంతాల్లోని వాణిజ్య భవనాల్లో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు  తాఖీదులు జారీ చేసింది. వారు చెల్లించాల్సిన బకాయిల వివరాలు పేర్కొంటూ ప్రతి దుకాణానికి అందజేసింది. ఆ సొమ్ములు చెల్లించకుంటే లైసెన్సులు రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. అవసరమైతే డిపాజిట్ల నుంచి కోత విధిస్తామని హెచ్చరించింది. దీంతో వ్యాపారులంతా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ కాలానికి అద్దెలు లెక్కకట్టడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయానికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

వీఎంఆర్‌డీఏకు ఎంవీపీˆ కాలనీ, సీˆతమ్మధార, సిరిపురం తదితర ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలున్నాయి. వీటిని తీసుకున్న వారు బకాయిలు పడ్డారు. ఒక్కో దుకాణదారుడు కనీసంగా రూ.2 లక్షల వరకు కట్టాలి. కొందరైతే రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకూ చెల్లించాలి. పాత బకాయిలు, కొవిడ్‌ పరిస్థితుల్లో చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీ, ఇతర పన్నులు కలిపి నోటీసులు ఇవ్వడంపై పలువురు విస్మయం చెందుతున్నారు. కైలాసగిరి తొమ్మిది నెలలు తెరవకున్నా ఆ కాలానికీ అద్దె కట్టాలంటున్నారని పలువురు దుకాణ దారులు వాపోతున్నారు.

మరో వైపు వీఎంఆర్‌డీకు చెందిన కార్యాలయాలు, కల్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాల్లో ఖాళీగా ఉన్న పలు దుకాణాలకు నెల, సంవత్సరం అద్దెకు వేలం నిర్వహించనున్నట్లు వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్లో పేర్కొంది. ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి దరఖాస్తు, డీడీ చెల్లించాలని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 3న వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని