Andhra News: విశాఖలో వధువు సృజన మృతి కేసు.. వీడిన చిక్కుముడి!
విశాఖపట్నంలోని మధురవాడలో వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు
మధురవాడ: విశాఖపట్నంలోని మధురవాడలో వధువు సృజన మృతి కేసులో చిక్కుముడి వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలు పొగొట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విశాఖ పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సృజన ఫోన్లో కాల్ డయల్ రికార్డర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను విశ్లేషించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
విశాఖ నగరంలోని పరవాడకు చెందిన తోకాడ మోహన్ అనే యువకుడితో ఏడేళ్లుగా సృజనకు ప్రేమ వ్యవహారం నడుస్తోంది. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఛాటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో వాళ్లు చేస్తున్న పెళ్లి తనకు ఇష్టం లేదని.. తీసుకెళ్లాలని మోహన్‌ను సృజన కోరింది. ఆర్థికంగా తాను ఇంకా స్థిరపడలేదని.. సరైన ఉద్యోగం లేదంటూ పెళ్లికి మోహన్ నిరాకరిస్తూ వచ్చాడు. కొంత సమయం నిరీక్షించాలని సృజనను కోరాడు.
ఈ క్రమంలో సృజనకు కుటుంబసభ్యులు ఈనెల 11న వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ పెళ్లి ఇష్టం లేని సృజన.. దాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తానని మోహన్‌కు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఆమె విషపదార్థం తీసుకుంది. కానీ ఊహించని రీతిలో పెళ్లిపీటలపైనే కుప్పకూలి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ కేసు వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. సాయంత్రం విశాఖ పోలీసు అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలపనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్‌లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్‌పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌కుమార్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం