logo

పంచ గ్రామాల సమస్యకు త్వరలో పరిష్కారం

విశాఖలో పంచ గ్రామాల సమస్య త్వరలో పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్‌లో వెల్లడించారు.

Published : 21 Mar 2023 03:28 IST

మంత్రి కొట్టు సత్యనారాయణ

సమావేశంలో పాల్గొన్న మంత్రులు కొట్టు సత్యనారాయణ, అమర్‌నాథ్‌, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్‌, ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఈనాడు-అమరావతి: విశాఖలో పంచ గ్రామాల సమస్య త్వరలో పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్‌లో వెల్లడించారు. ఇందుకోసం  ఇద్దరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు, విశాఖ కలెక్టర్‌తో ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై చర్చించించిదని చెప్పారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలపై దేవస్థానం భూమి విలువకు సమానమైన ప్రభుత్వ భూమిని బదలాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా అక్కడ నివశించే ప్రజలంతా పేద వర్గాలకు చెందిన వారైనందున ..వారిని కూడా దృష్టిలో పెట్టుకొని కమిటీ రెండు రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని