logo

ఫిర్యాదు చేస్తే.. నాపై కేసు పెట్టారు

సెల్‌ఫోన్‌ దొంగను పట్టించి, ఫిర్యాదు చేసిన పాపానికి పోలీసులు తనపైనే తప్పుడు కేసు కట్టి వేధిస్తున్నారని ఓ బాధితుడు నగర పోలీసు స్పందనలో ఫిర్యాదు చేశారు.

Published : 21 Mar 2023 03:28 IST

పోలీసులపై స్పందనలో ఓ బాధితుడి ఫిర్యాదు

ఫోన్‌ బాక్స్‌ను చూపుతున్న బాధితుడు రామకృష్ణ

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : సెల్‌ఫోన్‌ దొంగను పట్టించి, ఫిర్యాదు చేసిన పాపానికి పోలీసులు తనపైనే తప్పుడు కేసు కట్టి వేధిస్తున్నారని ఓ బాధితుడు నగర పోలీసు స్పందనలో ఫిర్యాదు చేశారు. అగనంపూడికి చెందిన బాధితుడు ఎం.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా అతని మాటల్లోనే... రూ.12వేల విలువైన తన ఫోన్‌ దొంగతానికి గురికాగా దువ్వాడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అయితే ఓ వ్యక్తి పోయిన ఫోన్‌లోని సిమ్‌ను తీసుకువచ్చి ఇచ్చాడు. ఫోన్‌మాత్రం ఇవ్వలేదు. అతని వివరాలు పోలీసులకు ఇచ్చినా పట్టించుకోలేదు. దొంగను పట్టుకోకుండా తనను వేధించటం ప్రారంభించారు. స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ దొంగలకు అండగా నిలిచి తనపై తప్పుడు కేసు నమోదు చేశారు. తనకు న్యాయం చేయాలని, తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్పందనలో ఫిర్యాదు చేశానని బాధితుడు వాపోయారు. పోయిన ఫోన్‌ తాలూకు బాక్స్‌ను అక్కడ విలేకరులకు చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని