logo

ఉపాధే ఊపిరి తీసింది..

చిన్న వయసులోనే ఇంటి పెద్ద దిక్కయ్యాడు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి పట్టుదల చూసి తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఇంతలో విధి ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. ఒక్కగానొక్క కుమారుడ్ని శాశ్వతంగా దూరం చేసింది. ఈ ఘటన రామభద్రపురంలో చోటుచేసుకుంది.

Published : 22 Jan 2022 05:45 IST
జగదీష్‌ (పాతచిత్రం)

రామభద్రపురర, న్యూస్‌టుడే: చిన్న వయసులోనే ఇంటి పెద్ద దిక్కయ్యాడు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి పట్టుదల చూసి తల్లిదండ్రులు ఆనందపడ్డారు. ఇంతలో విధి ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. ఒక్కగానొక్క కుమారుడ్ని శాశ్వతంగా దూరం చేసింది. ఈ ఘటన రామభద్రపురంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని సోంపురం గ్రామానికి చెందిన కొసుదొర జగదీష్‌ (18) ఐటీఐ చదివాడు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం కూలి పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా మారాడు. శుక్రవారం రామభద్రపురం జాతీయ రహదారి పనులు చేస్తుండగా టిప్పర్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇక దిక్కెవరంటూ తల్లిదండ్రులు నరిగేష్‌, గౌరమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని