logo

భూసమీకరణపై న్యాయ పోరాటం చేస్తాం

జీవో 80 రద్దుకు ఆందోళనలు చేస్తామని, భూసమీకరణపై న్యాయ పోరాటం చేస్తామని

Updated : 28 May 2022 04:04 IST

రెడ్డిపాలెంలో రైతులతో మాట్లాడుతున్న నాయకులు

రంగంపేట, న్యూస్‌టుడే: జీవో 80 రద్దుకు ఆందోళనలు చేస్తామని, భూసమీకరణపై న్యాయ పోరాటం చేస్తామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. రెడ్డిపాలెంలో ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు కోల్పోతున్న రైతులను శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కలిశారు. రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని, రైతుల భూములను లాక్కొని స్థిరాస్తి వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపించారు. పంటలు పండించే వ్యవసాయ భూముల జోలికొస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ బుద్దె పెద్దన్న, పున్నంరెడ్డి, సూర్యప్రకాశ్‌, శ్రీనివాస్‌, వర్దన్నపేట కాంగ్రెస్‌ సమన్వయకర్త నమిండ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని