logo

రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

కాజీపేట మండలం రాంపూర్‌ జాతీయ రహదారి(అవుటర్‌ రింగ్‌రోడ్డు) పక్క ఆగి ఉన్న వ్యాన్‌ను  సోమవారం రాత్రి 10.30 గంటలకు ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి.

Published : 21 Mar 2023 04:15 IST

ధర్మసాగర్‌, న్యూస్‌టుడే : కాజీపేట మండలం రాంపూర్‌ జాతీయ రహదారి(అవుటర్‌ రింగ్‌రోడ్డు) పక్క ఆగి ఉన్న వ్యాన్‌ను  సోమవారం రాత్రి 10.30 గంటలకు ద్విచక్రవాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ధర్మసాగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిల్పూర్‌ మండలం చిన్నపెండ్యాలకు చెందిన రామగుండం ఉదయ్‌కిరణ్‌(18), ఇదే గ్రామానికి చెందిన తంగళ్లపల్లి అఖిల్‌(21) అనే యవకులు ధర్మసాగర్‌ రింగ్‌రోడ్డు మీదుగా చిన్నపెండ్యాల వైపు వెళ్తున్నారు. అదే మార్గంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న వ్యాన్‌(వాహనం) రాంపూర్‌ శివారులోని కుంట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉండగా.. వెనక నుంచి ఢీకొట్టారు. ఉదయ్‌కిరణ్‌ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గాయాలపాలైన అఖిల్‌ను 108 అంబులెన్స్‌లో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి స్థానిక సీఐ రమేష్‌, పోలీసులు వచ్చి వివరాలను తెలుసుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఉపాధ్యాయుడి..

మడికొండ, న్యూస్‌టుడే: బంధువులను పరామర్శించడానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడు. మడికొండ ఎస్సై నర్సింహరావు కథనం ప్రకారం.. రాయపర్తి మండలానికి చెందిన భోజన కృష్ణ(36) కురవి మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం మడికొండ నుంచి రంగసాయిపేటలోని బంధువును పరామర్శించడానికి వెళ్లి రాత్రి 8.30గంటలకు ద్విచక్రవాహనంపై వస్తుండగా అమ్మవారిపేట మూల మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య రాధిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


సైబర్‌ నేరాల కట్టడికి చర్యలు

వరంగల్‌క్రైం: వరంగల్‌ కమిషనరేట్‌లో సైబర్‌ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీపీ రంగనాథ్‌ చెప్పారు. సోమవారం కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది ఆకతాయిలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొందరిని బురిడీ కొట్టిస్తున్నారన్నారు. చరవాణులకు గుర్తు తెలియని లింక్‌లు వస్తే క్లిక్‌ చేయవదన్నారు. ఇప్పటి వరకు జరిగిన సైబర్‌ నేరాలల్లో విచారణ వేగవంతంగా జరుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని