logo

గ్రేటర్‌ చెక్కులు తిరుగు టపా

గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ ప్రావీణ్య వరంగల్‌ జిల్లా పాలనాధికారిగా బదిలీపై వెళ్లారు. కొత్త కమిషనర్‌ నియామకమయ్యేవరకు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా కొనసాగాలని రాష్ట్ర పురపాలక శాఖ సూచించింది.

Published : 21 Mar 2023 04:15 IST

ఎస్సీ ఉపప్రణాళిక పనులు చేసిన గుత్తేదారుకు ఇచ్చిన చెక్కు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ ప్రావీణ్య వరంగల్‌ జిల్లా పాలనాధికారిగా బదిలీపై వెళ్లారు. కొత్త కమిషనర్‌ నియామకమయ్యేవరకు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా కొనసాగాలని రాష్ట్ర పురపాలక శాఖ సూచించింది. నిబంధనల ప్రకారం చూస్తే    ప్రావీణ్యకు పూర్తి అదనపు బాధ్యతలు (ఫుల్‌ అడిషనల్‌ ఛార్జి) అధికారిక ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ ఉత్తర్వులు లేకుండానే గ్రేటర్‌ వరంగల్‌ అకౌంట్సు విభాగం ఎస్సీ ఉపప్రణాళిక, పట్టణ ప్రగతి, సీఎం హామీలు తదితర అభివృద్ధి పనుల చెక్కులు గుత్తేదారులకు అందజేశారు. జిల్లా పాలనాధికారి సంతకం చేసిన సుమారు 15 చెక్కులు సోమవారం హనుమకొండ జిల్లా ఖజానాధికారి కార్యాలయంలో తిరుగు టపా కట్టాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడ లేదని, ఇవి చెల్లుబాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని ట్రెజరీ అధికారులు తేల్చి చెప్పడంతో గుత్తేదారులు పరేషానయ్యారు. అదే బల్దియా జనరల్‌ ఫండ్స్‌ ద్వారా జారీ చేసిన చెక్కులు మాత్రం చెల్లుబాటయ్యాయని తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని