logo

రాష్ట్ర స్థాయిలో పురస్కారం రావడం అభినందనీయం

వర్టికల్‌ విభాగంలో ఉత్తమ పనితీరు కనబర్చి రాష్ట్ర స్థాయిలో పురస్కారం అందుకోవడం అభినందనీయమని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు.

Published : 21 Mar 2023 04:15 IST

మహిళా పీసీలను అభినందిస్తున్న ఎస్పీ శరత్‌చంద్రపవార్‌

నెహ్రూసెంటర్‌, న్యూస్‌టుడే: వర్టికల్‌ విభాగంలో ఉత్తమ పనితీరు కనబర్చి రాష్ట్ర స్థాయిలో పురస్కారం అందుకోవడం అభినందనీయమని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పురస్కారం అందుకున్న ముగ్గురు మహిళా పోలీసులను సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అభినందించారు. మహబూబాబాద్‌ జిల్లాలో  కొత్తగూడ పీఎస్‌ విధులు నిర్వహిస్తున్న మహిళా ఏఎస్‌ఐ బి.శోభారాణి, కురవి పీఎస్‌లో పనిచేస్తున్న పీసీ గాడిపల్లి అనిత, మహబూబాబాద్‌ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా పీసీ డి.నాగమణి రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారన్నారు. రిసిప్షన్‌ అధికారులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు.

ప్రజలకు నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలి పోలీస్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని జిల్లా పోలీస్‌ అధికారి శరత్‌చంద్ర పవార్‌ సూచించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని