logo

నగరాన్ని చెత్త రహితం చేద్దాం

చేయి చేయి కలుపుదాం.. చారిత్రక నగరాన్ని చెత్త రహితం చేద్దామంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రతిజ్ఞ చేశారు.

Published : 30 Mar 2023 04:48 IST

ఎంజీఎం కూడలిలో మహిళల మానవహారం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: చేయి చేయి కలుపుదాం.. చారిత్రక నగరాన్ని చెత్త రహితం చేద్దామంటూ స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రతిజ్ఞ చేశారు. బుధవారం స్వచ్ఛోత్సవ్‌-2023 పేరిట బల్దియా ప్రధాన కార్యాలయం నుంచి కాకతీయ వైద్య కళాశాల వరకు ప్రదర్శన సాగింది. వరంగల్‌ ఎంజీఎం కూడలిలో పెద్ద ఎత్తున మానవహారం ఏర్పాటు చేశారు. మహిళలు ప్లకార్డులు చేత బూని చెత్తపై సమరం, పరిసరాల పరిశుభ్రత, మూడు బిన్లలో చెత్తను వేరు చేయడం, ఇంటి ముందుకొస్తున్న స్వచ్ఛ ఆటోకు చెత్త అందజేయడం, ప్రతి ఇంట్లో కంపోస్ట్‌ ఎరువు తయారీ, ప్లాస్టిక్‌ సంచులు వాడొద్దంటూ ప్రతిజ్ఞ చేశారు. ఉపకమిషనర్‌ రషీద్‌, ముఖ్య ఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజేష్‌, సెక్రటరీ విజయలక్ష్మి, సీˆహెచ్‌వో శ్రీనివాస్‌రావు, శానిటరీ సూపర్‌వైజర్లు సాంబయ్య, భాస్కర్‌, మెప్మా టీఎంసీ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎమ్మెల్యే పెద్ది, పుర ఛైర్‌పర్సన్‌ రజని, కమిషనర్‌

నర్సంపేట: ప్రతి ఒక్కరూ నర్సంపేట పట్టణాన్ని పరిశుభ్రత పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందడుగు వేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. స్వచ్ఛోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని మెప్మా ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో బుధవారం చేపట్టిన పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రత అవగాహన ప్రదర్శనను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పుర ఛైర్‌పర్సన్‌ గుంటి రజనితో కలిసి ప్రారంభించారు. అంతకు ముందు మహిళలతో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు.  ఎండ తీవ్రతను తట్టుకోలేక పలువురు మహిళలు ప్లెక్సీలు, కొంగులు తలలపై కప్పుకోగా ఇంకొందరు చెట్ల కిందకు చేరి సేద తీరారు. తాగునీటి వసతి కల్పించక పోవడంతో దప్పికతో ఇబ్బంది పడ్డారు. కార్యక్రమంలో పుర ఛైర్‌పర్సన్‌ రజని, కమిషనర్‌ వెంకటస్వామి, కౌన్సిలర్లు, మెప్మా డీఎంసీ రేణుక, ఏడీఎంసీ, ఆర్పీలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని