logo

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంతో పాటు బదిలీలను చేపట్టాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్‌ డిమాండ్‌ చేశారు.

Published : 10 Jun 2023 02:49 IST

వెంకటాపురం, న్యూస్‌టుడే: న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంతో పాటు బదిలీలను చేపట్టాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్‌ డిమాండ్‌ చేశారు. వెంకటాపురం మండల కేంద్రంలోని ఆ శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న భారాస ఈ నెలతో ముగియనున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే రివిజన్‌ కమిషన్‌ను నియమించి ఇంటీరియల్‌ రిలీఫ్‌ ఫండ్‌ను అమలు చేయాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలల ప్రారంభం మొదటి వారంలో ఒంటిపూట బడులను నిర్వహించాలన్నారు. విద్యార్థులకు శతశాతం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్‌ సమస్యలను సత్వరమే పరిష్కారం చూపాలన్నారు. ఈ కుబేర్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శిరుప సతీశ్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి సోలం కృష్ణయ్య, జిల్లా బాధ్యులు బండారి జగదీశ్‌, రమణయ్య, రాంబాబు, శేషాచలం, గోవర్థన్‌, మండల అధ్యక్ష కార్యదర్శులు రామారావు, లాలయ్య, వీరభద్రం, జి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని