logo

ఇంకా అరకొరగానే!

గతేడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందలేదు. చాలా మంది వ్యయప్రయాసల కోర్చి మార్కెట్లో అధిక ధరలకు పుస్తకాలు సమకూర్చుకున్నారు. ఈ ఏడాదైనా అందుకు భిన్నంగా కార్యాచరణ ఉంటుందనుకుంటే ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికీ కొన్ని తరగతులకు సంబంధించి ఒక్క పుస్తకమూ ముద్రణకు నోచుకోలేదు.

Updated : 27 Jun 2022 05:33 IST

పాఠశాలలకు అందని పాఠ్య పుస్తకాలు

నారాయణపురంలో పుస్తకాలను సరిచూస్తున్న సీఆర్పీలు (పాత చిత్రం)
 

ఉంగుటూరు, దెందులూరు, న్యూస్‌టుడే: గతేడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సకాలంలో పాఠ్య పుస్తకాలు అందలేదు. చాలా మంది వ్యయప్రయాసల కోర్చి మార్కెట్లో అధిక ధరలకు పుస్తకాలు సమకూర్చుకున్నారు. ఈ ఏడాదైనా అందుకు భిన్నంగా కార్యాచరణ ఉంటుందనుకుంటే ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికీ కొన్ని తరగతులకు సంబంధించి ఒక్క పుస్తకమూ ముద్రణకు నోచుకోలేదు. ఈ ఏడాది ప్రభుత్వ విద్యార్థులకే కాదు ప్రైవేటు వారికీ ముద్రించి ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఇండెంటు స్వీకరించారు. ఆంగ్ల మాధ్యమంలో ఏమైనా సందేహాలు వస్తే వెంటనే దాన్ని విద్యార్థి నివృత్తి చేసుకునేలా  సమాంతరంగా తెలుగులోనూ అదే పుస్తకంలో సమాచారం పొందుపరచాలని నిర్ణయించారు.  
ఎనిమిదో తరగతికి ఒక్కటీ రాలేదు..
ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఒక్క పుస్తకం కూడా సరఫరా కాలేదు. జులై 5 నుంచి పాఠశాలలను తెరవనున్నారు. అయినప్పటికీ పుస్తకాలు ముద్రితమై గోదాములకే చేరుకోకపోతే అనుకున్న సమయంలో ఎలా పంపిణీ చేస్తారని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
బడులు తెరిచే నాటికి అందుబాటులోకి..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు ఇప్పటి వరకు అన్ని మాధ్యమాల్లో కలిపి 16 లక్షల వరకు పుస్తకాలొచ్చాయి. వాటిని ఎమ్మార్సీ కార్యాలయాలకు తరలించాం. రోజూ పుస్తకాలు వస్తున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - గంగాభవాని, డీఈవో

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పుస్తకాల ఇండెంట్‌  32,06,274   పంపిణీ చేసినవి  16,26,022

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని