logo

జీపీఎస్‌ను అంగీకరించేదేలేదు: యూటీఎఫ్‌

ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ను అంగీకరించేదే లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా పేర్కొన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ కడప కలెక్టరేట్‌ ఎదుట ఆదివారం యూటీఎఫ్‌ నాయకులతో కలిసి సంకల్ప దీక్ష చేపట్టారు.

Published : 06 Feb 2023 02:27 IST

సంకల్ప దీక్షలో పాల్గొన్న యూటీఎఫ్‌ నాయకులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ను అంగీకరించేదే లేదని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా పేర్కొన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ కడప కలెక్టరేట్‌ ఎదుట ఆదివారం యూటీఎఫ్‌ నాయకులతో కలిసి సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు సీపీఎస్‌ రద్దు చేయాలని కోరకపోయినా ఎన్నికల సమయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. సీపీఎస్‌ విధానంపై సీఎంకు అవగాహన లేనందునే హామీ ఇచ్చారని.. దానికి బదులుగా జీపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. గన్నవరంలో చేపట్టిన సంకల్ప దీక్షను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో తామంతా ఆయా జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళనలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ్‌కుమార్‌, పాలెం మహేశ్‌బాబు ప్రసంగించగా, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి మధుసూదనరావు సంఘీభావం ప్రకటించారు. సంకల్పదీక్షలో లక్ష్మీరాజా, విజయ్‌కుమార్‌, మహేశ్‌బాబు, సుదర్శన్‌, కరీముల్లా, సీవీ రమణ, సుబ్బారెడ్డి, సూర్యకుమార్‌బాబు, చెన్నయ్య కూర్చున్నారు. కార్యక్రమంలో సుజాతరాణి, అయ్యవారురెడ్డి చెన్నయ్య, వెంకటసుబ్బయ్య, నర్సింహారావు, లింగారెడ్డి, గంగన్న, సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని