logo

సీఆర్‌పీఎఫ్‌కు అధునాతన ఆసుపత్రి

కలికిరి సీఆర్‌పీఎఫ్‌ సీˆఐఏటీ-3 శిక్షణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన పది పడకల ఆసుపత్రి, క్వార్టర్‌గార్డ్‌ భవనాలను సీఆర్‌పీఎఫ్‌ ఐజీ అజయ్‌ భరతన్‌ శనివారం ప్రారంభించారు.

Published : 26 Mar 2023 04:51 IST

వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్‌షా

ఆసుపత్రిని ప్రారంభిస్తున్న ఐజీ అజయ్‌భరతన్‌

కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే: కలికిరి సీఆర్‌పీఎఫ్‌ సీˆఐఏటీ-3 శిక్షణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన పది పడకల ఆసుపత్రి, క్వార్టర్‌గార్డ్‌ భవనాలను సీఆర్‌పీఎఫ్‌ ఐజీ అజయ్‌ భరతన్‌ శనివారం ప్రారంభించారు. అంతకు ముందు చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం జగదల్‌పూర్‌లోని 201 బెటాలియన్లో సీఆర్‌పీఎఫ్‌ 84వ వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా కలికిరి సీఆర్‌పీఎఫ్‌ కేంద్రంలో రూ.5.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయుధ నిల్వ గది, రూ.6 కోట్లతో నిర్మించిన పది పడకల ఆసుపత్రి భవనాలను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి వచ్చి శిక్షణ పొందే దళ సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ రాజేష్‌కుమార్‌, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎస్వీ సత్యనారాయణ, సీపీడబ్ల్యూడీ ఏఈ శ్రీనివాస్‌రెడ్డి, కలికిరి సర్పంచి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని