logo

రద్దయిన పింఛన్లు హైకోర్టు ఆదేశాలతో అందజేత

హైకోర్టు ఆదేశాలతో మండలంలోని మొరుసుపల్లెకు చెందిన చెలూరు నారాయణరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు అందాల్సిన 13 నెలల ఫించను సొమ్మును అధికారులు సోమవారం  అందజేశారు.

Published : 28 Mar 2023 03:14 IST

బాధితులకు పింఛను పంపిణీ చేస్తున్న సిబ్బంది

పెద్దతిప్పసముద్రం గ్రామీణ, న్యూస్‌టుడే: హైకోర్టు ఆదేశాలతో మండలంలోని మొరుసుపల్లెకు చెందిన చెలూరు నారాయణరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు అందాల్సిన 13 నెలల ఫించను సొమ్మును అధికారులు సోమవారం  అందజేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మమ్మ దివ్యాంగురాలు కావడంతో తెదేపా హయాంలో ఆమెకు పింఛను మంజూరైంది. ఆమె భర్త నారాయణరెడ్డికి వృద్ధాప్య పింఛను సైతం మంజూరు చేశారు. ఈ క్రమంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకే కుటుంబంలో ఇద్దరికి ఫించను వస్తుందనే కారణంతో అధికారులు 2021 డిసెంబర్‌ నుంచి 2022 డిసెంబర్‌ వరకు ఇద్దరికీ అందాల్సిన పింఛను సొమ్మును ఇవ్వకుండా ఆపేశారు. దీనిపై వృద్ధ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సదరు పింఛను మొత్తాన్ని ఏక మొత్తంలో ఇవ్వాలని ఆదేశించడంతో స్థానిక పంచాయతీ కార్యదర్శి భానుమూర్తి ఒక్కొక్కరికి రూ.39 వేల చొప్పున పింఛను సొమ్మును అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని