logo

ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట : ఉప ముఖ్యమంత్రి

పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు.

Published : 28 Mar 2023 03:14 IST

104 వాహనాలను ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

బిల్టప్‌ (కడప), న్యూస్‌టుడే : పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. సోమవారం కడపలోని క్యాంపు కార్యాలయ ఆవరణలో 104 నూతన వాహనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగుపరుస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో 1004 వ్యాధులకు చికిత్స అందించేదని, వైకాపా ప్రభుత్వం వచ్చాక 3,400 పైగా జబ్బులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందివ్వడానికి 104 వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నాగరాజు, అదనపు డీఎంహెచ్‌వో ఉమామహేశ్వరరావు, 104 వాహనాల జిల్లా మేనేజర్‌ వెంకటసుబ్బయ్య, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని