logo

64 అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతి

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య వర్సిటీకి మంజూరై భర్తీకి నోచుకోని 64 అధ్యాపక పోస్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.

Published : 29 Mar 2023 03:48 IST

తిరుపతి(పశువైద్య వర్సిటీ), న్యూస్‌టుడే: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య వర్సిటీకి మంజూరై భర్తీకి నోచుకోని 64 అధ్యాపక పోస్టుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. తిరుపతి పశువైద్య కళాశాల, కృష్ణాజిల్లా గన్నవరం, వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరుతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన విజయనగరం జిల్లా గరివిడి పశువైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 47 సహాయ అధ్యాపకులు, 17 సహ అధ్యాపకుల పోస్టుల భర్తీని దశలవారీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌పై ప్రభుత్వాన్ని స్పష్టత కోరామని.. అది రాగానే పోస్టులు భర్తీ చేయనున్నట్లు వర్సిటీ వీసీ వి.పద్మనాభరెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని