logo

పింఛను ఎల్‌ఐసీ ఉద్యోగుల జీవిత హక్కు

ఎల్‌ఐసీ ఉద్యోగులకు, పింఛనుదారులకు 30 శాతం ఫ్యామిలీ పింఛను తక్షణమే చెల్లించాలని ఎల్‌ఐసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.

Published : 30 Mar 2023 04:25 IST

ధర్నా చేస్తున్న ఎల్‌ఐసీ ఉద్యోగులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : ఎల్‌ఐసీ ఉద్యోగులకు, పింఛనుదారులకు 30 శాతం ఫ్యామిలీ పింఛను తక్షణమే చెల్లించాలని ఎల్‌ఐసీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. బుధవారం కడప ఎల్‌ఐసీ డివిజన్‌ కార్యాలయం ఎదుట పింఛనుదారులు ధర్నా చేపట్టారు. వివిధ సంఘాల నేతలు సుధీకర్‌, రఘునాథరెడ్డి, చంద్రపాల్‌ మాట్లాడుతూ 23 వేల మందికి వర్తించే 30 శాతం ఫ్యామిలీ పింఛను ప్రతిపాదనను యాజమాన్యం మూడున్నరేళ్ల క్రితం  సిఫారసు చేసినా కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికీ తేల్చలేదన్నారు. ఆర్బీఐ, జాతీయ బ్యాంకులు, నాబార్డు, గ్రామీణ బ్యాంకుల్లో ఈ పథకం అమలవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగినప్పుడల్లా పింఛను అప్డెషన్‌ చేస్తున్నారని, బీమా సంస్థల్లోనూ దీన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు అవధానం శ్రీనివాస్‌, శంకర్రావు, కస్తూరి, ఈశ్వర్‌రెడ్డి, నాయుడు, ఎల్లారెడ్డి, ఆనందరావు, వారిజాతమ్మ, శ్రీకృష్ణ, భాస్కర్‌, పర్వీన్‌, రాజు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని