logo

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన  పీలేరులో శనివారం చోటు చేసుకుంది. సీఐ మోహన్‌రెడ్డి వివరాల ప్రకారం..

Published : 04 Jun 2023 02:32 IST

ఇర్షాద్‌, విజయ్‌కుమార్‌ (పాత చిత్రాలు)

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన  పీలేరులో శనివారం చోటు చేసుకుంది. సీఐ మోహన్‌రెడ్డి వివరాల ప్రకారం.. మదనపల్లె వైపు నుంచి పీలేరుకు వస్తున్న బొలేరో వాహనం తిరుపతి నుంచి బెంగుళూరు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు శనివారం వేకువన పీలేరు పట్టణంలో కొండారెడ్డి మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బొలేరో వాహనంలో ఉన్న పీలేరుకు చెందిన ఇర్షాద్‌(27), ఇందిరమ్మకాలనీకి చెందిన విజయ్‌కుమార్‌(50) అక్కడికక్కడే మృతి చెందారు. బీ పీలేరు - రాయచోటి మార్గం పొంతలచెరువు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పీలేరు వైపు నుంచి రాయచోటి వెళుతున్న బొలెరో వాహనం, కడప వైపు నుంచి వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. కలకడ మండలం బొప్పసముద్రం గ్రామానికి చెందిన శేషాద్రి, గాలివీడు మండలం వెలిగల్లు ఇందుకూరువారిపల్లె కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణయ్య (50)ను వేలూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు