logo

Telangana News: రికార్డు కోసం.. అరగంట పాటు ఐస్‌ గడ్డల్లో..

కరీంనగర్‌ గ్రామీణ మండలం తీగలగుట్టపల్లికి చెందిన కామారపు రవీందర్‌ బుధవారం నీటి డ్రమ్ములో ఐస్‌ నింపారు. ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే అందులో అరగంట పాటు కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని 

Published : 03 Feb 2022 08:50 IST

ఐస్‌ ముక్కలు వేసిన నీటి డ్రమ్ములో రవీందర్‌

తీగలగుట్టపల్లి(కరీంనగర్‌ గ్రామీణం) : కరీంనగర్‌ గ్రామీణ మండలం తీగలగుట్టపల్లికి చెందిన కామారపు రవీందర్‌ బుధవారం నీటి డ్రమ్ములో ఐస్‌ నింపారు. ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగానే అందులో అరగంట పాటు కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని చిత్రీకరించి  ఆస్ట్రేలియాలోని వండర్‌ వరల్డ్‌ రికార్డు సంస్థకు పంపిస్తానని రవీందర్‌ తెలిపారు. 2018లో గర్భిణిగా ఉన్న తన భార్యతో 10 కి.మీ. పరుగును 47 నిమిషాల్లో పూర్తి చేయించి అప్పట్లో రికార్డు సాధించానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని