‘మేం భారత్‌ బంద్‌లో పాల్గొనడం లేదు’

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన ‘భారత్‌ బంద్’‌లో తాము పాల్గొనడం లేదని బ్యాంకు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే వారికి మద్దతుగా పనిగంటల ముందు, తర్వాత నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నాయి...

Published : 08 Dec 2020 02:11 IST

రైతుల ఆందోళనకు మద్దతుగా ఉంటామన్న బ్యాంకర్లు

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన ‘భారత్‌ బంద్’‌లో తాము పాల్గొనడం లేదని బ్యాంకు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే వారికి మద్దతుగా పనిగంటల ముందు, తర్వాత నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నాయి. అంతేకాకుండా నల్లరంగు బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తిస్తామని వెల్లడించాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత పదిరోజులుగా రైతులు దిల్లీలో ఆందోళన చేపట్టారు. ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా వందల సంఖ్యలో రహదారులపైనే ఉంటున్నారు. ప్రభుత్వం వరుసగా చర్చలు జరిపినప్పటికీ అన్నదాతలు శాంతించలేదు. మంగళవారం నాడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు.

తమ సంఘం రైతులు చేపట్టిన భారత్‌ బంద్‌కు మద్దతునిస్తుందని అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ) జనరల్‌ సెక్రెటరీ సౌమ్య దత్తా అన్నారు. తాము సైతం ధర్నా చేపట్టడం లేదని, బంద్‌లో పాల్గొనడం లేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) జనరల్‌ సెక్రెటరీ సీహెచ్‌ వెంకటాచలం తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తిస్తామని వారు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని