ఆన్‌లైన్లో ఆర్డర్‌.. పోలీస్ ఫుడ్‌ డెలివరీ

ఆన్‌లైన్లో ఫుడ్‌ ఆర్డర్ చేస్తే మామూలుగా సదరు ఫుడ్‌ డెలివరీ సర్వీసు బాయ్స్‌ పార్సిల్స్‌ను అందిస్తారు. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్లో కబాబ్‌ ఆర్డర్‌ చేస్తే.. స్థానిక పోలీసు అధికారి ఫుడ్‌ ఆర్డర్‌ను డెలివరీ చేయడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు జరిగిందంటే..

Published : 29 Oct 2020 01:49 IST

బ్రిటన్‌ : ఆన్‌లైన్లో ఫుడ్‌ ఆర్డర్ చేస్తే మామూలుగా సదరు ఫుడ్‌ డెలివరీ సర్వీసు బాయ్స్‌ పార్సిల్స్‌ను అందిస్తారు. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్లో కబాబ్‌ ఆర్డర్‌ చేస్తే.. స్థానిక పోలీసు అధికారి ఫుడ్‌ ఆర్డర్‌ను డెలివరీ చేయడంతో ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు జరిగిందంటే.. ఫుడ్‌ ఆర్డర్‌కు సంబంధించిన పార్సిల్‌ను తీసుకొని డెలివరీ బాయ్‌ కారులో బయలుదేరాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా కారును ఆపిన పోలీసులు డెలివరీ బాయ్‌ను లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌ సంబంధించిన వివరాలు అడిగారు. అతను వీటి గురించి అబద్ధాలు చెప్పడంతో పాటు డ్రైవింగ్‌ చేసే సమయంలో మాదకద్రవ్యాలను వాడినట్లు తేలింది. దీంతో పాటు కారు టైర్ల స్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ దేశంలోని థేమ్స్‌ వ్యాలీ పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన వ్యక్తి కారులో ఫుడ్‌ పార్సిల్‌ ఉన్నట్లు ఓ పోలీస్‌ అధికారి గమనించారు. పార్సిల్‌పై ఉన్న అడ్రసు ఆధారంగా ఆ అధికారి కబాబ్ పార్సిల్‌ను కస్టమర్‌ ఇంటికి వెళ్లి అందజేశారు. పుడ్‌ డెలివరీ బాయ్‌ అందజేయాల్సిన పార్సిల్‌ను పోలీసు అధికారి ఇంటికి వచ్చి ఇవ్వడంతో ఆశ్చర్యపోవడం కస్టమర్‌ వంతైంది. ఈ విషయాన్ని ఆ కస్టమర్‌ ట్విటర్‌ వేదికగా పంచుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పలువురు నెటిజన్లు ఆ పోలీసు అధికారిని ప్రశంసించారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని