
తాళిబంధం కోసం..పేగుబంధం తాకట్టు
భువనేశ్వర్: భర్త వైద్య ఖర్చుల కోసం ఓ మాతృమూర్తి తన కన్న కొడుకును తాకట్టు పెట్టిన దయనీయ ఉదంతమిది. ఒడిశాలోని గంజాం జిల్లా భంజ్‌నగర్‌కు చెందిన జిలీ నాయక్ భర్త దుఖా నాయక్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అప్పటి నుంచీ ఇంటికే పరిమితమయ్యాడు. ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది. దీంతో ఆయనకు ఎలాగైనా మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించుకున్న జిలీ.. ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. చికిత్స ఖర్చుల కోసం తన ఐదు నెలల కుమారుడిని సొంత అక్క వద్ద రూ.10 వేలకు తాకట్టు పెట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరి హృదయాలను కలచివేస్తోంది.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.