Incontinence: అమ్మా.. మూత్రంపై పట్టు ఉండటం లేదా..? ఎందుకో తెలుసుకోండి..!

వయసుతో సంబంధం లేకుండా మూత్రం అదుపులో లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాం. చాలా వరకు మధుమేహం ఉన్న వాళ్లకే ఇలాంటి సమస్య వస్తుందని భావిస్తారు. కానీ మూత్రాశయంలో సమస్య తలెత్తితే మహిళలకు మూత్రంపై పట్టు ఉండక పెనుసవాల్‌గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.

Updated : 02 Oct 2022 14:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసుతో సంబంధం లేకుండా మూత్రం అదుపులో లేకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాం. చాలా వరకు మధుమేహం ఉన్న వాళ్లకే ఇలాంటి సమస్య వస్తుందని భావిస్తారు. కానీ మూత్రాశయంలో సమస్య తలెత్తితే మహిళలకు మూత్రంపై పట్టు ఉండక పెనుసవాల్‌గా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. పదిమందిలోకి వెళ్లడం, కార్యాలయాల్లో పని చేయడానికి చాలా అవస్థలు పడాల్సి వస్తుందని గైనకాలజిస్టు డాక్టర్‌ మణి అక్కినేని వివరించారు.

ఇలా ఎందుకవుతుందంటే...

మూత్ర విసర్జన ఎంత ముఖ్యమో దానిపై పట్టు అంతే అవసరం. మూత్ర విసర్జన సులువైన పని కాదు..మూత్రాశయం, మూత్ర మార్గ కండర వలయం, కటి కండరాలు, నాడులు అన్నీ కలిసి సమన్వయంతో పని చేస్తేనే విసర్జన ప్రక్రియ సజావుగా సాగుతుంది. కిడ్నీలలో తయారైన మూత్రం నాళాల ద్వారా మూత్రాశయంలోకి వచ్చి చేరుతుంది. మూత్రం విసర్జించేదాకా అందులో ఉండిపోతుంది. మెదడుకు సంకేతాలు వెళ్లిన తర్వాతే విసర్జన సాఫీగా సాగిపోతుంది. ఏ భాగమైన సరిగా పని చేయకపోతే నవ్వినా, దగ్గినా మూత్రం పడిపోతుంది. 30 ఏళ్లు దాటిన వారికి, మెనోపాజ్‌ తర్వాతగానీ ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. 50 ఏళ్లు దాటిన మహిళల్లో 70 శాతం ఈ ఇబ్బందులుంటాయి. పిల్లలను కనడంతో ఈ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. 

ఏం చేయాలంటే..!

మూత్రంపై పట్టులేని మహిళలకు వైద్యం కూడా అందుబాటులో ఉంది. దీనికి సిస్టాస్కోపీతో మూత్రాశయంలోని పరిస్థితిని తెలుసుకుంటాం. పాలిప్స్‌, ఇతర కారణాలేమైనా ఉంటే చికిత్స చేయవచ్చు. కండరాలను గట్టిపడేలా కొన్ని వ్యాయామాలను సూచిస్తాం. దీంట్లో ప్రధానంగా కీగెల్‌ వ్యాయామం ఒకటి. వీటిని చేయడంతో మంచి ఫలితం ఉంటుంది. కొన్ని రకాల శస్త్రచికిత్సలు అవసరమైతే చేయొచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని