Top Ten News @ 1 PM

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఏపీలోని పలు జిల్లాల్లో నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఈరోజు, మరికొన్నిచోట్ల రేపు కూడా వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.  చిత్తూరు జిల్లాలో ఓ వైపు కొవిడ్‌ టీకా రెండో డోస్‌ వేయించుకోవాల్సిన

Published : 10 May 2021 12:57 IST

1. Coronavaccine:పలు జిల్లాల్లో నిలిపివేత

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఏపీలోని పలు జిల్లాల్లో నిలిచిపోయింది. కొన్ని చోట్ల ఈరోజు, మరికొన్నిచోట్ల రేపు కూడా వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.  చిత్తూరు జిల్లాలో ఓ వైపు కొవిడ్‌ టీకా రెండో డోస్‌ వేయించుకోవాల్సిన వారి జాబితా తయారు చేస్తుండగా జిల్లాలో రెండ్రోజుల పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిపేస్తున్నట్లు అక్కడి వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

*Coronavaccine: కేంద్రాల వద్ద బారులు

2. సరిహద్దు వద్ద ఏపీ కొవిడ్‌ అంబులెన్స్‌లు అడ్డగింత

ఏపీ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు, మరణాలు

కరోనా రక్కసి కాటుకు యావత్‌ దేశం చిగురుటాకులా విలవిల్లాడుతోంది. లక్షల మందిపై మహమ్మారి విరుచుకుపడుతూనే ఉంది. వేల మందిని పొట్టనబెట్టుకుంటోంది. 24 గంటల వ్యవధిలో 3.66లక్షల మంది కొవిడ్ బారినపడ్డారు. అంతక్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు దాదాపు 35వేలకు పైగా తగ్గడం గమనార్హం. అయితే నిర్ధారణ పరీక్షలు తగ్గడం వల్లే కేసుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. Vaccine విధానంలో కోర్టు జోక్యం తగదు

కరోనా వ్యాక్సిన్‌ ధరలు, టీకాల కొరతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విధానాన్ని కేంద్రం సమర్థించింది. ప్రస్తుత మహమ్మారి సంక్షోభం వేళ ప్రజాప్రయోజనాల దృష్ట్యా నిపుణులు, శాస్త్రీయ సలహాలతో టీకా విధానాన్ని రూపొందించామని తెలిపింది. ప్రజాప్రయోజనాల నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం తగదని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 218 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. TNR: కరోనాతో కన్నుమూత

ప్రముఖ యూట్యూబ్‌ యాంకర్‌, జర్నలిస్ట్‌, నటుడు టీఎన్‌ఆర్‌ కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారినపడగా, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. యూట్యూబ్‌ వేదికగా ఎంతో మంది సినిమా ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు. అతిథిలు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన సంధించే ప్రశ్నలు సూటిగా ఉండేవి. అంతేకాదు, నటుడిగానూ టీఎన్‌ఆర్‌ తనదైన ముద్రవేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Corona: అమితాబ్‌ రూ.2కోట్ల విరాళం

6. ఆరు అడుగుల ఎడంతో అధిక రక్షణ 

కరోనా వైరస్‌ గాలిలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? వ్యక్తుల మధ్య ఎంత ఎడం ఉంటే మహమ్మారి బారిన పడే ముప్పు తగ్గుతుంది? చాలామంది మెదళ్లను తొలిచేస్తున్న ఈ ప్రశ్నలకు అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తాజాగా మరోసారి సమాధానాలిచ్చింది. కొవిడ్‌ రోగి నుంచి 3-6 అడుగుల లోపు వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటుందని తేల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. Baricitinib తయారీకి సిప్లా ఒప్పందం

కొవిడ్‌-19 వ్యాధి బాధితులు త్వరగా కోలుకునేందుకు వీలుకల్పించే 'బారిసిటినిబ్‌' ఔషధాన్ని భారత్‌లో తయారు చేసి విక్రయించేందుకు అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ ఔషధ సంస్థతో దేశీయ ఔషధ తయారీ సంస్థ సిప్లా లిమిటెడ్ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకొంది. బారిసిటినిబ్‌ను ఇప్పటి వరకూ రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వ్యాధిని అదుపు చేయటానికి వినియోగిస్తున్నారు. దీన్ని ఆస్పత్రుల్లో చేరిన కొవిడ్‌-19 బాధితులకు 'రెమ్‌డెసివిర్‌' ఔషధంతో కలిపి ఇవ్వటానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) గతేడాది నవంబరులో అత్యవసర అనుమతి ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కాడా.. నిమ్మకాయ.. విటమిన్‌ మాత్రలు 

కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కరోనా సోకకుండా జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. ‘‘సింఘు సరిహద్దులో ఇప్పటివరకు పెద్దగా కరోనా వైరస్‌ కేసులు లేవు. రైతులు ‘కాడా’ (మూలికలు, వివిధ మసాలాలతో తయారు చేసిన రసం), నిమ్మకాయ నీళ్లు, విటమిన్‌ మాత్రలు వాడుతున్నారు. ఆందోళన పడాల్సిన అవసరమే లేదు’’ అని సుఖ్వీందర్‌ అనే రైతు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఖాతాను వేరే బ్రాంచ్‌కి బ‌దిలీ చేయాలా..

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులా? మీ ఖాతాను వేరే బ్రాంచ్‌కి బదిలీ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళ‌కుండానే, ఆన్‌లైన్ ద్వారా ఒక శాఖ నుంచి మ‌రొక శాఖ‌కు ఖాతాను బ‌దిలీ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. కరోనా నేప‌థ్యంలో, కాంటాక్ట్ లెస్ డిజిట‌ల్ సేవ‌ల‌కు బ్యాంకు ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని ఇందులో భాగంగానే ఈ సేవ‌ల‌ను అందిస్తున్న‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Covid: టీ20 ప్రపంచకప్‌నకూ తప్పకపోవచ్చు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నిరవధికంగా వాయిదా పడటం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వేదిక తరలింపునకు లేదా వాయిదాకు కారణం కావొచ్చని ఆస్ట్రేలియా  మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అంటున్నాడు. గతంలోనూ అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నాడు. అందులో కొన్ని ఆసక్తికర మ్యాచులకు దారితీయగా కొన్నిబాధాకరమని వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* IPL: మేమంటే.. మేమని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని