AP High Court: డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.

Updated : 19 Feb 2024 15:35 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించడం సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్‌ తరపు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించడం వల్ల పది లక్షల మంది డీఎడ్‌ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారనన్నారు. సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టిందని పిటినర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీం తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాలి కదా?అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని