ఒక్కటైన సిర్పూర్ అబ్బాయి, నేపాలీ అమ్మాయి
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు ఇతర దేశాలకు రాకపోకలను నిలిపివేశాయి. అలాంటి సమయంలోనూ తమ ప్రేమను నిలుపుకుని ఓ జంట ఒక్కటైంది....
సిర్పూర్(టి): కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పలు దేశాలు ఇతర దేశాలకు రాకపోకలను నిలిపివేశాయి. అలాంటి సమయంలోనూ తమ ప్రేమను నిలుపుకొని ఓ జంట ఒక్కటైంది. కొవిడ్ ఆంక్షలతో అమ్మాయి తల్లిదండ్రులు భారత్‌కు రాలేకపోవడంతో.. అబ్బాయి బంధువులే అమ్మానాన్నలుగా మారి కన్యాదానం జరిపించారు.
కుమురం భీం జిల్లా సిర్పూర్(టి) మండలానికి చెందిన అచ్యుత్ కుమార్.. ఖతార్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అక్కడే నేపాల్‌కు చెందిన రమీల అనే యువతితో ప్రేమలో పడ్డాడు. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారు. దీంతో అబ్బాయి స్వస్థలంలో వివాహం జరిపాలనుకున్నారు. అయితే ఈ క్రమంలోనే కరోనా వైరస్ విజృంభించి.. దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఆంక్షల నడుమ వరుడు స్వదేశానికి చేరుకున్నాడు. కానీ వధువు నేపాల్‌లోనే ఉండిపోయింది. అయినా ఎలాగైనా ఒక్కటవ్వాలని ఆ జంట భావించింది. అధికారులకు పలు ఆధారాలు చూపించడంతో రమీలతోపాటు తన సోదరుడిని మాత్రమే భారత్‌లోకి అనుమతించారు. వధువు తల్లిదండ్రులకు అనుమతి లభించలేదు. దీంతో వరుడి మేనమామ, మేనత్తలు అమ్మాయికి అమ్మానాన్నలుగా మారి వివాహం ఘనంగా జరిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్