TS news : తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు

శ్రీరాంసాగర్‌ వరద కాలువ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ షోకాజ్‌ నోటీసులిచ్చింది. గౌరవెల్లి సర్పంచ్‌ బద్దం రాజిరెడ్డి పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ సందర్భంగా...

Updated : 25 Jan 2022 22:14 IST

చెన్నై: శ్రీరాంసాగర్‌ వరద కాలువ ప్రాజెక్టు అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ షోకాజ్‌ నోటీసులిచ్చింది. గౌరవెల్లి సర్పంచ్‌ బద్దం రాజిరెడ్డి పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ సందర్భంగా కేంద్రం ఈ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులో మార్పులు చేసినట్లు నివేదికలో పేర్కొంది. ఉల్లంఘనలపై ఎందుకు చర్యలు తీసుకోరాదో జవాబు చెప్పాలని కేంద్రం 15 రోజుల గడువు విధించింది. అయితే, ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులు చేపట్టడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపగా, విచారణను ఫిబ్రవరి 10 తేదీకి ఎన్జీటీ చెన్నై బెంచ్‌ వాయిదా వేసింది.

ఏపీలో 3 రిజర్వాయర్లకు అనుమతులు తప్పని సరి

ఏపీలో 3 రిజర్వాయర్లకు కేంద్రం పర్యావరణ అనుమతులను తప్పనిసరి చేసింది. అవులపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్లకు అనుమతులు తప్పనిసరి చేస్తూ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఎన్జీటీకి నివేదిక దాఖలు చేసింది. ఈ మూడు రిజర్వాయర్లు గాలేరు-నగరి సుజల స్రవంతి పరిధిలోకి రావని తెలిపింది. శ్రీశైలం జలాలను చిత్తూరు జిల్లాకు తరలించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేసింది. రూ.6వేల కోట్లతో 3 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించింది.అయితే కేంద్ర అనుమతులు లేకుండానే ఏపీ ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టింది. దీంతో 3 ప్రాజెక్టులపై బాధితులు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. పొలాలను ముంచేలా రిజర్వాయర్లు చేపట్టినట్లు పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, ఇవాళ 3 ప్రాజెక్టులపై కేంద్ర పర్యావరణ శాఖ తన వైఖరిని ఎన్జీటీలో తేల్చి చెప్పింది. 3 ప్రాజెక్టుల పనులు చేపట్టబోమని ఎన్జీటీలో ఏపీ అండర్‌ టేకింగ్‌ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని