CM Jagan: జగన్‌ మైదుకూరు పర్యటన.. పోలీసుల అత్యుత్సాహం

సీఎం జగన్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానికులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు.. ఆంక్షల పేరుతో పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. 

Published : 25 Dec 2023 12:55 IST

మైదుకూరు: సీఎం జగన్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానికులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు.. ఆంక్షల పేరుతో పోలీసులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. జగన్‌ సోమవారం వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో పర్యటిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఓ వివాహ వేడుకలో పాల్గొనాల్సి ఉంది. అయితే, అక్కడ ఉదయం నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు మొదలయ్యాయి. బద్వేల్‌ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. ద్విచక్రవాహనాలను సైతం అనుమతించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌ అత్యుత్సాహం ప్రదర్శించారు. విలేకరి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఉద్యోగానికి ఆలస్యం అవుతుందని చెబుతున్నా వినిపించుకోలేదు. మీసం మెలేస్తూ దుర్భాషలాడారు. పోలీసుల తీరుతో వివాహవేడుకకు వచ్చిన వారు సైతం ఇబ్బంది పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని