CM Revanth: నిజామాబాద్‌లో పసుపు రికార్డు ధర.. సీఎం రేవంత్‌ హర్షం

నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు క్వింటాకు రూ.14 వేల ధర పలకడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 

Published : 28 Feb 2024 22:54 IST

హైదరాబాద్‌: నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు క్వింటాకు రూ.14 వేల ధర పలకడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో పసుపు బోర్టు పెట్టాలి. పసుపు బోర్టు ఏర్పాటు చేస్తే రైతులకు శాశ్వతంగా మేలు జరగుతుంది. ఇందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు.

నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు పంట బుధవారం రికార్డు ధర పలికింది. క్వింటా పసుపు గరిష్ఠ ధర రూ.14,255 పలికింది. ఈ సీజన్‌లోనే ఇది అత్యధిక ధర. కనిష్ఠంగా రూ.8వేలు, సగటున రూ.11,500 పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని