ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/01/2022)

ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02/01/22)

Updated : 02 Jan 2022 03:42 IST

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

చేపట్టిన పనులను ప్రణాళికా ప్రకారం పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికి ప్రశంసలు లభిస్తాయి. సూర్యుడిని ఆరాధిస్తే మంచిది.

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒక విషయంలో పెద్దలను కలుస్తారు. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. విష్ణు సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తే మేలు జరుగుతుంది. ఊహించని  ఆటంకాలు ఎదురవుతాయి. చేయని తప్పుకు నిందపడాల్సి వస్తుంది. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లలితాదేవి ఆరాధన శుభదాయకం.

ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో స్పష్టత వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెద్దల ఆశీస్సులుంటాయి.  సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసరంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుడిని ఆరాధించాలి.

మిశ్రమకాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దుర్గాదేవిని ఆరాధించాలి.

మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమామహేశ్వర స్తోత్రం పఠిస్తే మంచిది.

చేపట్టే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి.  బంధువులతో మాటపట్టింపులకు పోరాదు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. 

కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. కనకదుర్గాదేవి సందర్శనం శుభప్రదం.

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. శ్రీ రామ నామాన్ని జపించాలి.

సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అవసరానికి తగిన సాయం చేసే వారున్నారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. గోవింద నామాలు చదవడం ఉత్తమం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని