Hyderabad: పాతబస్తీ మెట్రో పనుల కోసం డ్రోన్ సర్వే.. ప్రధాన సవాళ్లివే!

పాతబస్తీ మెట్రో పనుల కోసం డ్రోన్ సర్వేను హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చేపట్టారు. పాతబస్తీలో మెట్రో అలైన్‌మెంట్, ప్రభావిత ఆస్తులపై డ్రోన్‌ సర్వేను చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Updated : 27 Aug 2023 18:29 IST

హైదరాబాద్‌: పాతబస్తీ మెట్రో పనుల కోసం డ్రోన్ సర్వేను హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చేపట్టారు. పాతబస్తీలో మెట్రో అలైన్‌మెంట్, ప్రభావిత ఆస్తులపై డ్రోన్‌ సర్వేను చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ఇరుకైన మార్గంలో ప్రభావిత ఆస్తుల కచ్చితమైన కొలతలు తీసుకోవడానికి ఈ సర్వే చేశామన్నారు. 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు మెట్రో నిర్మాణానికి ప్రధాన సవాలుగా ఉన్నాయని వివరించారు.

మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలను రక్షించడానికి డ్రోన్ సర్వే సాయపడనుందన్నారు. మెట్రో అలైన్‌మెంట్, పిల్లర్ లొకేషన్‌లు ఈ నిర్మాణాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ప్లాన్‌ చేస్తున్నామన్నారు. డ్రోన్ సర్వే ద్వారా రియల్ టైమ్ డేటా, త్రీడి మోడలింగ్, జీఐఎస్ డేటా, డేటా విశ్లేషణ, విజువలైజేషన్‌ను త్వరితగతిన సేకరించవచ్చన్నారు. మరికొద్ది రోజుల్లో భూ పరిశోధన ప్రారంభించడానికి టెండర్లు కూడా ఖరారు చేస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని