Earthquake: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.

Updated : 25 Aug 2023 10:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. తెల్లవారుజామున 4.45 నిమిషాలకు సుమారు 5 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. దీంతో పలుచోట్ల ఇళ్లలోని వస్తువులు కదిలాయి. నిద్రలో  ఉన్న ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ నిర్ధారించింది. 

మణుగూరులో ఈనెల 19న కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. ఆరు రోజుల వ్యవధిలోనే మళ్లీ రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే భూ ప్రకంపనల వల్ల జరిగిన నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని