AP News: 22 ఎకరాల భూమిని ఆక్రమించిన ఎమ్మెల్యే.. సబ్ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ వద్ద గ్రామస్థుల ధర్నా

ఎమ్మెల్యే కిలారి రోశయ్య తమ భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.

Updated : 29 Feb 2024 15:36 IST

పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమతులపూడిలో ఎమ్మెల్యే కిలారి రోశయ్య తమ భూములను అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ దుగ్గిరాల సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. గ్రామంలో గత 40 ఏళ్లుగా 22 ఎకరాల చెరువు భూమిలో పంటలు పండించుకుంటున్నామని రైతులు చెప్పారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి స్థానిక ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఈ భూములను తన అనుచరుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అనుమతులపూడి గ్రామస్థులు, తెదేపా నాయకులు ఆరోపించారు. 

గతంలో ఈ భూములను కాజేసేందుకు యత్నించగా తామంతా న్యాయస్థానానికి వెళ్లి వాటిని కాపాడుకున్నామని చెప్పారు. తప్పుడు సంతకాలతో న్యాయస్థానానికి వెళ్లి ఆ పిటిషన్‌ను ఎమ్మెల్యే కొట్టేయించుకున్నారన్నారు. దీంతో ఆ భూమిని అధికారులు డినోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, డీనోటిఫై ఉత్తర్వులు రాగానే ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, పెదకాకాని శివాలయం ఛైర్మన్ అమ్మిశెట్టి శంకర్రావు, అతని కుమారులు, కోడళ్ల పేరుతో ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న దస్త్రాలు ఆన్‌లైన్‌లో కనిపించకుండా అధికారులు వాటిని దాచేశారని, వాటిని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని