Nellore: ముత్తుకూరు జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. 

Published : 27 Apr 2023 18:33 IST

వెంకటాచలం: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. మూడో యూనిట్లోని సీసీఆర్‌ కంట్రోల్‌ రూమ్‌లో విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఎలక్ట్రికల్ బ్రేకర్‌ పేలడంతో మంటలు వ్యాపించాయి. దీంతో సమీపంలో పనిచేస్తున్న సురేష్‌, కార్తీక్‌లతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు.

అప్రమత్తమైన తోటి కార్మికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జెన్‌కోలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఘటనపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని