నిత్యానందకు నోటీసులు ఇవ్వలేకపోయాం

అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న నిత్యానందకు బెయిల్‌ రద్దుకు సంబంధించిన నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వలేకపోయామనికర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. నిత్యానంద ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నట్లు భావిస్తున్నట్టు హైకోర్టుకు

Updated : 04 Feb 2020 15:27 IST

హైకోర్టుకు వెల్లడించిన కర్ణాటక ప్రభుత్వం


బెంగళూరు :  అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న నిత్యానందకు బెయిల్‌ రద్దుకు సంబంధించిన నోటీసులు వ్యక్తిగతంగా ఇవ్వలేకపోయామని కర్ణాటక ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపింది. నిత్యానంద ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నట్లు  హైకోర్టుకు విన్నవించింది.  

నిత్యానంద బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు నిత్యానందకు నోటీసులు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ బెయిలు రద్దుకు సంబంధించిన నోటీసులను ఆయన ఆశ్రమంలోని కుమారి అర్చనానందకు ఇచ్చామని డిప్యూటీ సూపరింటెండెంట్‌(సీఐడీ) బాలరాజ్‌ హైకోర్టుకు తెలిపారు. ఆ సందర్భంలో నిత్యానంద ఆచూకీ తెలియదనే సమాధానం ఆశ్రమ వర్గాల నుంచి వచ్చినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే నోటీసులు అందుకున్న మహిళ మాత్రం, తనకు బలవంతంగా పోలీసులు నోటీసులు ఇచ్చారని హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించింది.

ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జాన్‌ మైఖేల్‌ కున్హా పోలీసుల తీరును తప్పుపట్టారు. ఈ కేసులో ఇవే మొదటి నోటీసులా అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కేసు విచారణ నుంచి తప్పించుకోవడానికే నిత్యానంద దేశం నుంచి పారిపోయాడని ఫిర్యాదుదారుని తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాకుండా నిందితుడు ఈక్వెడార్‌లో ఆశ్రయం కోసం ప్రయత్నించగా రెండు పాస్‌పోర్టుల ఉన్న కారణంగా అది విఫలమైనట్టు వార్తలు వచ్చాయని తెలిపాడు. పూర్తి వాదనల అనంతరం హైకోర్టు ఈ కేసును ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు