స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు

లాక్‌డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఇవాళ స్వస్థలాలకు బయలుదేరనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో దాదాపు 5 వేల మంది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఉత్తరాంధ్ర

Published : 28 Apr 2020 17:09 IST

వీరావల్‌ (గుజరాత్‌): లాక్‌డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్‌లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఇవాళ స్వస్థలాలకు బయలుదేరనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో దాదాపు 5 వేల మంది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి అక్కడే ఉండిపోవడంతో వారి సమస్యను ఇటీవలే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లడంతో వారిని స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.3 కోట్లు అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరావల్‌లో ఉన్నవారిని అక్కడ నుంచి బస్సుల్లో పంపించేందుకు గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. వీరంతా కాసేపట్లో అక్కడనుంచి బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని