ఉచిత కరోనా పరీక్షలు ప్రారంభం

జీహెచ్‌ఎంసీ సహా పరిసరాల్లో 50వేల కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించిన సర్కారు ఇవాళ్టి నుంచి టెస్టులను ప్రారంభించింది. వనస్థలిపురం, కొండాపూర్‌,

Published : 16 Jun 2020 12:10 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ సహా పరిసరాల్లో 50వేల కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించిన సర్కారు ఇవాళ్టి నుంచి టెస్టులను ప్రారంభించింది. వనస్థలిపురం, కొండాపూర్‌, సరూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రుల్లో ఈరోజు నుంచి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలాపూర్‌ ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో కూడా శాంపిల్స్‌ సేకరిస్తున్నారు. గతంలో పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్‌ అయిన వారికి మొదట పరీక్షలు చేయనున్నట్టు రంగారెడ్డి డీఎంహెచ్‌ఓ స్వరాజ్య లక్ష్మి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా పాజిటివ్‌ కేసులు వచ్చిన నేపథ్యంలో టెస్టులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని