AP News: నీలం సాహ్నిపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ పరిషత్‌ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ....

Updated : 21 May 2021 18:05 IST

అమరావతి: ఏపీలో పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కూడా ఉదయం ఆదేశించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఎస్‌ఈసీ తమకు కావాల్సినట్లుగా అన్వయించుకున్నారని ఆక్షేపించింది.

‘‘సుప్రీంకోర్టు తీర్పును అవగాహన చేసుకోవడంలో విఫలమయ్యారు. సుప్రీం తీర్పును ఇలా అన్వయించుకోవడం ఆమోద యోగ్యం కాదు. 4వారాల సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టంగా ఉంది. ఆంగ్ల భాష తెలిసిన సామాన్యుడికీ సుప్రీంకోర్టు తీర్పు అర్థమవుతుంది. ప్రస్తుత ఎస్‌ఈసీ గతంలో సీఎస్‌గానూ పనిచేశారు. సుప్రీం కోర్టు తీర్పును సరిగా అర్థం చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటప్పుడు ఎస్‌ఈసీగా ఆమె అర్హతపై ఆలోచించాల్సి వస్తుంది. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఏప్రిల్‌ 1న నోటిఫికేషన్‌ ఇచ్చి 10న కౌంటింగ్ ఎలా చేస్తారు? ఎస్‌ఈసీ వైఖరి ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉంది’’ అంటూ న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని