Nazi: 75ఏళ్ల కిందటి ‘నాజీ’ క్యాంపు హత్యలపై.. ఇప్పుడు విచారణ!
రెండో ప్రపంచయుద్ధం ముగిసి డెబ్బై ఐదేళ్లు దాటాయి. ఆ యుద్ధం సమయంలో జరిగిన ఎన్నో నేరాలు.. ఘోరాల గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. 1933లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్‌గా పదవి చేపట్టగానే దేశవ్యాప్తంగా కాన్సంట్రేషన్ క్యాంపులను ఏర్పాటు చేశారు. రాజకీయ, యుద్ధ ఖైదీలను ఆ క్యాంపులో
బెర్లిన్: రెండో ప్రపంచయుద్ధం ముగిసి డెబ్బై ఐదేళ్లు దాటాయి. ఆ యుద్ధం సమయంలో జరిగిన ఎన్నో నేరాలు.. ఘోరాల గురించి చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. 1933లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ ఛాన్సలర్‌గా పదవి చేపట్టగానే దేశవ్యాప్తంగా కాన్సంట్రేషన్ క్యాంపులను ఏర్పాటు చేశారు. రాజకీయ, యుద్ధ ఖైదీలను ఆ క్యాంపుల్లో ఉంచి.. దారుణంగా హింసించేవారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో చేతికి చిక్కిన అనేక మంది ఖైదీలను సైతం ఈ క్యాంపుల్లోనే బంధించేవారు. ఈ క్రమంలో కొన్ని లక్షల మంది ఈ క్యాంపుల్లో ఖైదీలుగా మారారు. అయితే, వారిలో కొంతమంది ఆకలికి, వెట్టిచాకిరికి తాళలేక చనిపోతే.. మరికొందరిని నాజీ సైనికులు కాల్చి... ఉరితీసి చంపేశారు. ఆ దుర్గార్మపు సంఘటనల గురించి ఇప్పుడు ఎందుకంటారా..? అప్పుడు జరిగిన కొన్ని హత్యల కేసులపై తాజాగా విచారణ జరిపేందుకు జర్మన్ కోర్టు సిద్ధమైంది మరి.
నాజీల హయాంలో జరిగిన హత్యలపై దర్యాప్తు చేయడానికి కొన్నాళ్ల కిందట లుడ్విగ్స్‌బర్గ్‌లో స్పెషల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్స్ కమిటీ ఏర్పాటు కాగా.. తాజాగా ఆ హత్యల కేసు నిరుప్పిన్ కోర్టుకు బదిలీ అయింది. ఈ నేపథ్యంలో 1936 -1945 మధ్య కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పనిచేసిన వారిని.. అక్కడ జరిగిన హత్యలతో సంబంధం ఉన్నవారిని విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఈ క్రమంలో ఆ హత్యలతో సంబంధం ఉండి.. ఇప్పటికీ బతికున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇద్దరు వృద్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు.
10వేలకుపైగా హత్యల కేసులో నిందితురాలిగా 96 ఏళ్ల మహిళ
రెండో ప్రపంచయుద్ధం సమయంలో స్టట్టొఫ్ కాన్సంట్రేషన్ క్యాంపు చీఫ్‌కు సెక్రటరీగా పనిచేసిన ఓ మహిళపై కొన్ని నెలల కిందట కేసు నమోదైంది. ఆ క్యాంపులో 10వేలకుపైగా ఖైదీల హత్యకు ఆమెతో సంబంధం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె వయసు ఇప్పుడు 96ఏళ్లు. సెప్టెంబర్ చివరివారంలో ఈ కేసుపై కోర్టు విచారణ జరపనుంది.
వందేళ్ల వృద్ధుడు.. 3,518 హత్యల కేసులో నిందితుడు
1942 -1945 మధ్య బెర్లిన్‌కు సమీపంలోని సచెన్‌హాసెన్ కాన్సంట్రేషన్ క్యాంపులో గార్డుగా పనిచేసిన ఓ వ్యక్తిపై ఇటీవల కేసు నమోదు చేశారు. ఆ క్యాంపులో 3,518 మంది ఖైదీలను తుపాకీలతో కాల్చి, విషవాయువులను వదిలి హత్య చేశారట. ఆ సమయంలో నిందితుడు అక్కడే ఉన్నాడని అభియోగం. ప్రస్తుతం ఆ నిందితుడి వయసు 100. దీంతో కోర్టుకు అతడు హాజరు కాగలడా లేదా అని వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణకు హాజరయ్యేందుకు అతడి ఆరోగ్యం సహకరిస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ తొలివారంలో విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది. నిందితులిద్దరిపై విచారణ జరుపుతామని కోర్టు చెప్పడంతో ప్రస్తుతం జర్మనీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య
-
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
-
భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు
-
శ్వేతసౌధం, పెంటగాన్ ఫొటోలు తీసిన కిమ్ శాటిలైట్?
-
సాగర సర్పం.. కాటేస్తే కష్టం