IAF: ఎయిర్‌ఫోర్స్‌లో ‘అగ్నివీర్‌వాయు’ ఉద్యోగాలు.. దరఖాస్తులు షురూ

భారతవాయుసేనలో అగ్నివీరుల నియామకాలకు దరఖాస్తులు నేటి నుంచే ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..

Updated : 17 Mar 2023 18:02 IST

దిల్లీ: భారత వాయుసేన (Indian Air force)లో అగ్నివీరులుగా (Agniveer) చేరాలనే ఆసక్తి కలిగినవారికి గుడ్‌న్యూస్‌. అగ్నిపథ్‌ (Agnipath) పథకంలో భాగంగా అగ్నివీర్‌వాయు (Agniveervayu) నియామకాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన అధికారులు.. మార్చి 17 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మార్చి 31 సాయంత్రం 5 గంటలతో ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగియనుంది. అందువల్ల ఇంటర్మీడియెట్‌లో కనీసం 50 శాతం మార్కులతో పాసైన వారు/ మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా (మెకానికల్/ ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.250.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. అభ్యర్థులకు నిర్దిష్ట శారీరక దారుఢ్య/  వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. వయస్సు విషయానికి వస్తే.. 26-12-2002 నుంచి 26-06-2006 మధ్య జన్మించి ఉండాలి. అలాగే,  పురుషులైతే 152.5 సెం.మీ; మహిళలు 152 సెం.మీ.ల చొప్పున ఎత్తును కలిగి ఉండాలి.  ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌, ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.  ఆన్‌లైన్‌ పరీక్షలు మే 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు