Indrasena Reddy: త్రిపుర గవర్నర్‌గా భాజపా సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి

త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated : 18 Oct 2023 22:55 IST

దిల్లీ: త్రిపుర(Tripura), ఒడిశా(Odisha) రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. త్రిపుర నూతన గవర్నర్‌గా తెలంగాణకు చెందిన భాజపా సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్‌ మాజీ సీఎం రఘుబర్‌ దాస్‌లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవారు. ఆయన గతంలో మలక్‌పేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2022లో రాష్ట్రంలో భాజపా చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా ఆయన నియమితులైన విషయం తెలిసిందే. ఒడిశా నూతన గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌దాస్‌ 2014 నుంచి 2019 వరకు ఝార్ఖండ్‌ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని