విద్యుత్‌ అక్రమాలపై 100 రోజుల్లో నివేదిక: జస్టిస్‌ నరసింహారెడ్డి

థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనుల్లో అక్రమాలు, ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు చేసుకున్న పీపీఏలపై విచారణ ప్రారంభించామని జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు.

Updated : 07 Apr 2024 17:23 IST

హైదరాబాద్‌: థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణ పనుల్లో అక్రమాలు, ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు చేసుకున్న పీపీఏలపై విచారణ ప్రారంభించామని జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా విచారణ చేపడతామని, వంద రోజుల్లో నివేదిక సమర్పిస్తామని తెలిపారు. గతంలో నిర్మించిన థర్మల్‌ ప్లాంట్‌లు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పీపీఏలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌కు జస్టిస్ నరసింహారెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఆదివారం బీఆర్‌కే భవన్‌లో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ఎస్‌ఏఎం రిజ్వీ, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, ఇతర అధికారులతో ఆయన రెండుగంటల పాటు సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఛత్తీస్‌గఢ్‌తో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందం చేసుకున్న సమయంలో నిర్ణయాలు తీసుకున్న కొంతమంది అధికారుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఆ సమయంలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ లేఖలు రాస్తామన్నారు. ఈ విషయంలో ప్రజా అభిప్రాయ సేకరణ ఉంటుందని, సమాచారం అవసరం అనుకున్న వారికి నోటీసులు కూడా అందజేస్తామని స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని