Btech Ravi: బీటెక్‌ రవిని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన కడప కోర్టు

పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)(Btech Ravi)ని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Published : 17 Nov 2023 17:50 IST

కడప: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్‌ రవి)(Btech Ravi)ని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈనెల 14న వల్లూరు పోలీసులు బీటెక్‌ రవిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే, ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ వల్లూరు పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కడప కోర్టు శుక్రవారం కొట్టివేసింది. మరో వైపు.. బీటెక్‌ రవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కడప కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు