Ghazal srinivas: గజల్ శ్రీనివాస్ ఆలపించిన మహువా డాబర్ పోరాట గీతం ఆవిష్కరణ

చారిత్రాత్మక 1857 భారత స్వాతంత్ర్య ఉద్యమ పోరాట యోధుడు

Updated : 26 Jun 2022 18:21 IST

లఖ్‌నవూ: 1857 భారత స్వాతంత్ర్య ఉద్యమ తొలి పోరాట యోధుడు మహువా డాబర్ పోరాట స్ఫూర్తి గీతాన్ని ఉత్తర్‌ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. విప్లవవీరుడు పిరయ్ ఖాన్ నాయకత్వంలో 1857లో ఈ పోరాటం జరిగింది. ఆంగ్లేయులు ఎంతో మంది దేశభక్తుల గృహాలకు నిప్పంటించి సజీవదహనం చేశారు. మరి కొందరిని ఉరి తీశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ట్రిపుల్ గిన్నీస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత గజల్ శ్రీనివాస్ తన స్వీయ సంగీత సారథ్యంలో గానం చేసిన హిందీ గీతాన్ని ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా అంకితం చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కల్నల్ తిలక్ రాజ్  ఈ గేయాన్ని రచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని