ఆ నదిలో పాల ప్రవాహం

యూకేలోని ఓ నదిలో పాలు ప్రవహించాయి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, వేల్స్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న దులైస్ నదిలో అకస్మాత్తుగా ఏప్రిల్ 14 నుంచి పాల ప్రవాహం మొదలైంది. ఈ ఘటనతో

Updated : 21 Dec 2022 14:54 IST

వేల్స్‌: యూకేలోని ఓ నదిలో పాలు ప్రవహించాయి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, వేల్స్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న దులైస్ నదిలో అకస్మాత్తుగా ఏప్రిల్ 14 నుంచి పాల ప్రవాహం మొదలైంది. ఈ ఘటనతో ఆశ్చర్యానికి గురైన స్థానికులు ఏమైందా అని ఆరాతీస్తే అసలు నిజం వెలుగుచూసింది. దులైస్ నదికి సమీపంలో ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడి అందులోని 28 వేల లీటర్ల పాలు వరదలా పోటెత్తి నదిలోకి ప్రవహించాయి. దీంతో.. దులైస్ నది క్షీర ప్రవాహాన్ని తలపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని