Medaram: మేడారం వెళ్లే వీఐపీలకు మంత్రి సీతక్క కీలక సూచన

మేడారం జాతరపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క సోమవారం సమీక్ష నిర్వహించారు.

Published : 19 Feb 2024 16:05 IST

హైదరాబాద్‌: మేడారం జాతరపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క సోమవారం సమీక్ష నిర్వహించారు. జాతరకు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు జాతర వివరాలు సేకరిస్తూ.. బడ్జెట్‌ కేటాయిస్తున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. వీఐపీలు వారి వాహనాలను ములుగులో ఉంచి బస్సులో మేడారం వెళ్లాలని సూచించారు. జాతరకు ఖర్చు చేసే ప్రతి రూపాయి వివరాలు ప్రజల ముందుంచుతామన్నారు. సమ్మక్క-సారలమ్మ చరిత్రను శిలాశాసనం చేసి మేడారంలో ఏర్పాటు చేస్తామని సీతక్క తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు