నీట్‌ ఫలితాలు విడుదల

దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది........

Updated : 22 Aug 2022 14:47 IST

దిల్లీ: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 13న జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) నిర్వహించిన విషయం తెలిసిందే.  ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా (90శాతం మంది) హాజరయ్యారు.

కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్‌ 13న కరోనా నేపథ్యంలో హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 14న ప్రత్యేకంగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను వెబ్‌సైట్‌ ద్వారా అధికారులు శుక్రవారం విడుదల చేశారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

నిరుత్సాహ పడకండి..

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులెవరూ నిరుత్సాహపడవద్దని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ నిశాంక్‌ విజ్ఞప్తి చేశారు. వారి కోసం ఇతర రంగాల్లో అవకాశాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఒక పరీక్షే మనల్ని నిర్వచించదని, ఆయా రంగాల్లో మీ తెలివితేటలు ఈ దేశానికి ఎంతో అవసరమని తెలిపారు. 

వెబ్‌సైట్‌ మొరాయింపు.. ఆందోళనలో విద్యార్థులు

మరోవైపు, ఫలితాలు విడుదల చేసినప్పటికీ వెబ్‌సైట్‌ మొరాయించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు సర్వర్‌ డౌన్‌ అయిందని పేర్కొంటూ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు వెబ్‌సైట్‌ను రిఫ్రెష్‌ చేస్తున్నా ఓపెన్‌ కావడంలేదని పేర్కొంటూ ట్వీట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని