ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.. తాడేపల్లిగూడెం నిట్‌లో విద్యార్థుల ఆందోళన

బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Updated : 22 Nov 2022 14:39 IST

తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్‌)లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫ్యాకల్టీ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిట్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద విద్యార్థులు బైఠాయించారు. అతడిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా హెచ్‌ఓడీ పట్టించుకోవడం లేదని.. అందుకే తరగతులను బహిష్కరించి ఆందోళనకు దిగినట్లు చెప్పారు. అతడితో బహిరంగ క్షమాపణ చెప్పించి విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఆందోళనతో నిట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోవైపు నిట్‌ ప్రాంగణంలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని