NRI Yashasvi: ఎన్‌ఆర్‌ఐ యశస్వికి హైకోర్టులో ఊరట

ఎన్ఆర్‌ఐ యశస్వి (NRI Yashasvi)కి ఏపీ హైకోర్టు (AP High Court) లో ఊరట లభించింది.

Updated : 30 Jan 2024 16:53 IST

అమరావతి: ఎన్ఆర్‌ఐ యశస్వి (NRI Yashasvi)కి ఏపీ హైకోర్టు (AP High Court) లో ఊరట లభించింది. తనపై సీఐడీ (CID) ఇచ్చిన లుక్‌ ఔట్‌ నోటీసును ఎత్తివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ను ఇప్పటికే సీఐడీ అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చిందని న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు.  అరెస్టు చేసి 41ఏ నోటీసు ఇచ్చిన తర్వాత లుక్‌ ఔట్‌ నోటీసు కొనసాగించటం ఆర్టికల్‌ 21కి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నోటీసు కారణంగా విదేశాలకు వెళ్లాలంటే పిటిషనర్‌కు ఇబ్బందులుంటాయని, కొట్టివేయాలని కోర్టును కోరారు. వాదనలు విన్న ధర్మాసనం సీఐడీ జారీ చేసిన లుక్‌ ఔట్‌ నోటీసును రద్దు చేస్తూ బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని